music

mp3 format files

Friday, June 29, 2012

chaaturmaasya vratamu

చాతుర్మాస్య వ్రతము హరి భక్తీ విలాసము భవిష్య పురాణములలో చెప్పబడినది.  ఈ వ్రత ముఖ్య ఉద్దేశ్యము ప్రాణి కోటికి జీవ కోటికి అహింసయే. యీ వ్రతము ఆషాడ సుద్ద  ఏకాదశి నుండి కార్తీక శుద్ద ఏకాదశి  వరకు అనుష్టించ వలెను. ఈ సమయములో ఆహార నియమములు చాల ముఖ్యమైనది. ఒక్కొక్క మాసము ఒక్కొక్క ఆహార వర్జమును పాటించడము ఒక వ్రతముగా అనుష్టించ వలెను.  మొదటి మాసము శాక వ్రతము  అంటే అన్ని కూరలను వర్జించటం శ్రీధరుని అనుగ్రహమునకు. రెండవ మాసము దధి వ్రతము పెరుగు తదితర సంభితిత వస్తువుల వర్జము హృషీకేస ప్రీతికోరకు.మూడవ మాసము క్షీర వ్రతము పాలు తదితర సంబంధిత వస్తువుల వర్జము పద్మనాభ ప్రీతి కొరకు. నాల్గవ మాసమందు ద్వివిద బహుబీజ గింజల వర్జము దామోదర ప్రీతి కొరకు. దీనితో కూడా ముఖ్యమైనది నేలపై పరుండడం. ఈ నాలుగు మాసములు విష్ణు పురాణము భగవద్ గీత, రామాయణం మహాభారతము భాగవత పురాణము వంటి గ్రంథ పారాయణము చేయడము సదా భగవంతుని స్మరణ తో  గడపడం చాల ముక్యమైనది.
చాతుర్మాస్య వ్రతము ఒక్క సన్యాస ఆశ్రమ వాసులకే కాదు గృహస్తులు కూడా పాటించ వలసినదే. ఈ సమయమున మహా విష్ణు యోగ నిద్రలో ఉండటము వాళ్ళ శుభా కార్యములు అంటే వివాహము, ఉపనయనము, నూతన గృహప్రవేశము, దేవాలయ ప్రతిష్ట లాంటివి చేయ కూడదు. కార్తీక శుద  ఏకాదశి అనంతరమే చేయవలెను. 
చాతుర్మాస్య వ్రతము గృహస్తులకు ఉపాకర్మ వ్రతము వలెనే సన్యాస ఆశ్రమంలో  వ్యాస పూజ చేసి మరియు తనకు ఆత్మ గ్యానము కలిగించిన గురువులకు కూడా పూజ చేసి వ్రత ఆరంభము చేసెదరు. సన్యాసికి ముఖ్యమైనది జీవ హింస చేయకుండా ఉండడము సర్వ ప్రాణి కోటి యందు ఒకే మాదిరి సంచరిస్తూ భేద అబెధములు ద్వేష ద్వేషములు లేకుండా ఎల్లప్పుడు సదా నారాయణ స్మరణతోనే గడపవలసి యుంటుంది. అందుకే సన్యాసి ఒకే చోటిలో మకాం పెట్టుకోకుండా సదా సంచారములోనే ఉండవలెను. లేకుంటే లౌకికమైన వ్యవాహరములలో సంబడితుడు కావలసి వుంటుంది. సన్యాసి ఎప్పుడు వండుకోకూడదు గృహస్తు వద్ద భిక్షతోనే జీవించాలి. దీని ఉద్దేశము వంట చేసేటప్పుడు ఎన్నో సుక్ష్మ క్రిముల సంహరణము చేయకుండా  ఉండటమే. అయితే సన్యాసులకు ఈ చాతుర్మాస్య వ్రత కాలమందు ఒకే చోటిలో ఉండుటకు శాస్త్రము ధర్మమూ నిర్దేసించి చెప్పింది కారణము జీవ హింస చేయకూడదని.  వర్షా కాలములో ఎన్నో పురుగులు సుక్ష్మ జీవులు బయట  ఆహారము కొరకై సంచరిస్తుంటుంది మనము  నడిచే టప్పుడు మన పాదములకింద నలిగి పోయే అవకాశములు ఎక్కువ కాబట్టి సన్యాసులకు ప్రయాణము వర్జించ బడెను.
ఈ చాతుర్మాస్య వ్రత విధానము ఒక సనాతన ధర్మ వాసులకే కాదు, బౌద్ధులు జైనులు కూడా దీనిని పాటిస్తారు. నారద మహర్షి తన పూర్వ జన్మలో తన తల్లితోకుడా చాతుర్మాస్య కాలములో సన్యాసులకు సహాయము చేస్తూ వారిచ్చిన గింజలను వాటిని తినడం వారితో కూడా భాగవత కదా శ్రావణము చేయడము వల్లనే తనకు జ్యానము కలిగిందని భాగవతం లో చెప్పి ఉన్నది.
గృహస్తులు ఈ చాతుర్మాస్య వ్రతము అనుష్టించేతప్పుడు కుమ్భములో వ్యాసాది మూర్తులను ప్రతిష్టించడం పరిపాటి కాని సన్యాసులకు నిమ్మ పండ్లయండు ఆవాహన చేసి పూజించ వలెను
వ్యాస పూజ యందు ఒక వ్యాస మహర్షినే కాక ఆరు వర్గములుగా ఆవాహన చేయడము పరిపాటి.
మొదటి వర్గమునందు శ్రీకృష్ణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్హ, సంకర్షనాదులు కృష్ణ పంచకముగా ఆవాహనము చేయవలెను.
రెండవ వర్గమందు వ్యాస, పైల, వైసంపాయన, జైమిని, సుమంతులు వ్యాస పంచకముగా ఆవాహనము చేయవలెను.
మూడవ వర్గమందు శంకరులు, పద్మ పాదులు, సురేస్వరులు, హస్తామలకులు, తోటకులు, భాగవత పంచకముగా ఆవాహనము చేయవలెను.
నాల్గవ వర్గమందు సనక, సనందన, సనత్కుమార, సనాతన, సనత్సుజాతాదులను సనక పంచకముగా ఆవాహనము చేయవలెను. 
ఐదవ వర్గమందు ద్రవిడాచార్య  గౌడపాదచార్య, గోవింద భాగవత్పాదాచార్య, సంక్షేపాచార్య, వివరానచార్యులను ద్రావిడ పంచకముగా ఆవాహనము చేయవలెను.
ఆరవ వర్గమందు, గురు, పరమ గురు, పరమేష్టి గురు, పరాపర గురువులను గురు పంచకముగా ఆవాహనము చేయవలెను.
వీరితో కూడా శుక, నారద, దుర్గ, గణపతి , క్షేత్రపాలక, సరస్వతి , ఇంద్ర, అగ్ని, యమ, నిర్రుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన, బ్రమ్హ, అనంతులను ఆవాహన చేయవలెను.
సుద్ధ చైతన్యమును సాలిగ్రామమందు ఆవాహన చేసి పూజించ వలెను.
సన్యాసుల కూటమి యందు  వయోపరిమితితో పెద్దగా గణింప బడరు.  ఆ సన్యాసి ఎన్ని చాతుర్మాస్య పూజలు చేస్తే అంత ప్రముఖుడు అంటే ముఖ్యత్వము కలుగును.
మనము దక్షినమునండు వ్య్యాస పౌర్ణమిగా అనుష్టిస్తే ఉత్తరమునందు గురు పౌర్ణమిగా పుజిస్తారు. స్మార్తులు చాతుర్మాస్యము వ్యాస పూజతో ఆరంభించి విశ్వరూప యాత్రతో ముగిస్తారు.

THOLI YEKADASI

ఆషాఢ శుక్ల ఏకాదశి మనము శయన ఏకాదశి అని వ్రతము ఆచరిస్తాము. దీనినే దేవ శయన ఏకాదశి  ఆషాడ ఎకదాసి లేక విష్ణు శయన ఏకాదశి లేక హరి వాసర ఏకాదశి లేక పెద్ద ఏకాదశి లేక  తొలి ఏకాదశి అని కూడా అంటాము. ఈ వ్రత విధానము భవిష్యోత్తర పురాణములో యుదిష్టురునకు శ్రీకృష్ణుడు చెప్పిన విదానముగా ఉన్నది.
పూర్వ కాలములో ఇక్ష్వాకు వంశములో మాంధాత అను చక్రవర్తి అయోధ్య నగరాన్ని పరిపాలిస్తుండెను. అతను రాజ్య పాలన బహు దార్మికముగా చేస్తూ ప్రజలను కన్నా బిడ్డల వలె కంటికి రెప్పల కాపాడుతూ రాజ్య పాలన జరుపుతూ ఉండెను. కొంత కాలమునకు అతని రాజ్యములో తీవ్రమైన కరువు సంభవించెను. ప్రజలు త్రాగుటకు కూడా నీరు దొరకక అవాస్త పడుతున్దిరి  నీరు లేని కారణమున దేవ రుషి పితృ ప్రీతి కార్యములకు భంగము వాటిల్లినది.  ప్రజలు క్లిష్టపరిస్తితిని రాజుకు విన్నవించుకుని తగిన పరిహారములు చేయించ మని వేడిరి .
మాంధాత చక్రవర్తి అంగిరస మునిని ప్రార్తించిన మీదట అతను ఆషాడ శుద్ద ఏకాదశి రోజున మాహవిష్ణుని శ్రద్హతో పూజించి పూర్తిగా ఉపవాసము ఉంది ద్వాదశి రోజున పార్వణ చేసిన  దేశము సుభిక్షముగా ఉంటుందని అదేసించెను  మాంధాత చక్రవర్తి తానూ తన ప్రజలతో కుడా ఈ వ్రతము జరుపుకొని సకాలములో వర్షములు కురిసి పంటలు బాగుగా పండి అన్ని క్రతువులు జరుపుకొంటూ సంతోషముగా ఉండిరి.
మనము కుడా ఆషాడ శుద్హ ఎదాదసి నాడు ఉపవాసము ఉంది మహా విష్ణును పూజిస్తే మనకు కుడా అన్ని సంరుద్హిగా లభిస్తుందని పెద్దల వాక్కు.
ఉపవాసము ఉండకపోయిన విష్ణు సహస్రాన్ని అయిన ప్రొద్దుట సాయంకాలము భక్తితో చదవండి ......
 

Monday, June 25, 2012

streelu gamanincha valasinadi

మీరు గమనించ వలసినది
౧ పుట్టినరోజు వివాహమైన రోజు మొదలగు విశేష దినములందు ఇంటిలోని పెద్ద వారందరికీ  నమస్కరించి ఆశిస్సులు పొందడం మనము అనుసరించి పిల్లలందరినీ అనుసరింప చేయవలెను
౨ అందరు తల దువ్వుకోనేటప్పుడు పాపిట తీసి దువ్వుకొన  వలెను. పాపిట లేకుండా దువ్వుకోనుట దరిద్రాని సంభవింప చేస్తుంది. పాపిట తీయడంలో ఆరోగ్య విషయము ఏమిటంటే తలలో నీరు చేరకుండా ఉండడానికి సహకరిస్తుంది  తలలో నీరు చేరుకొంటే అనేక రోగములకు దారి తీస్తుంది కదా.
౩ మెంతులు ఆహారములో ఉపయోగించడం వలన బుద్ధి కుశలత పెరుగుతుంది
౪ ప్రతిరోజూ రెండు అరటి పండ్లను తీసుకొంటే రక్త పోటు తగ్గుతుంది. కార్రోట్ వండేటప్పుడు ఇంకొక కూరను చేర్చకుండా వండవలెను లేకపోతె కార్రోట్ పోషక విలువలు దొరకవు.
౫ పితృ దినములను భిక్షము ఇంటిలో వేయకూడదు. రోలు రోకలి సంనిగిల్లు చాట ఇంటి కడప పైన కుర్చొన కూడదు  అందువల్ల దరిద్రము సంభవించును. కూర్చొనే బల్లను కాలితో తన్న కూడదు. పండుకొని నీరు త్రాగరాదు.
౬ రెండు చేతులతో తలను గీరుకోరాదు. తల విరవ పోసుకొని గడప దాటి పోరాడు.
౭ ఇతరులపై కోపగించుకోని చాడీలు చెప్పరాదు.తన గురించి తన కుటుంబం గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు  ఎదుటి వారి మనస్సు నొచ్చు కోనేలాగున మాటలాడ కూడదు.
౮  సదా నామ స్మరణ చేయండి వంట వండేటప్పుడు ఇంటిలో మిగత పనులు చేసుకునేటప్పుడు నామ స్మరణ చేస్తూ ఉంటె మనకు అవసాన కాలంలోకూడా మన మనస్సు దానినే స్మరిస్తూ మనకు పై జన్మ ఉత్తమమైనదిగా దొరుకును 
౯ కాలము వస్తువు యొక్క విలువ తెలుసుకొని దానిని ఉపయోగించుకోన వలెను. 
౧౦ కుటుంబములోని కలతలను బంధువుల వైషమ్యములను స్త్రీ అవలీలగా సరిచేయ గలదు. బుద్ధి కుశలత ఇచ్చి పుచ్చుకొనే మనస్తత్వము ఉండవలెను. 
౧౧ ఇంటిలోపల వెంకటేశ్వర స్వామి అమ్మవారితో కూడా    స్వర్ణ అలంకారములతో ఉండే పటము వుంచుకొని   పుజిస్తుంటే వాస్తు దోషములన్నియో పరిహారము అగును.  .
౧౨ మురికి చేరుకొన్న పళ్ళు,  మురికి గుడ్డలు ధరించడం, చిరిగినా దుస్తులు ధరించడం, అధికమైన తిండి, ఎల్లప్పుడు నిష్టుర భాషణం, సంధ్యా కాలాలలో నిద్రించడం చేయకుదనివి ఇది దరిద్రానికి దారి కల్పిస్తుంది.
౧౩ అజీర్ణమునకు జీలకర సొంటి జాజికాయ పొడి సమముగా ఒక స్పూన్ తీసుకొని వెచ్చటి నీతితో తాగితే సరిపోతుంది. మలబద్దకం ఉంటె రాత్రి పడుకొనే ముందు ఒక స్పూన్ కరక్కాయ పొడి వెచ్చటి నీతితో తాగి పడుకోండి పొద్దున్న సులబమైన విరేచనము కలుగును.  దగ్గు అధికముగా వుంటే కొద్దిగా మిరియాలు తాటి కలకండ కలిపి బుగ్గలో పెట్టుకొని ఆ నీటిని మింగుతూ వుంటే చాలు.
౧౪ సుఖమైన దుఖమైన దానిని అనుభవించ వలసిందే ఇది రెండు బండి చక్రముల వలె మానవ జీవితంలో వచ్చేవే ఏది శాశ్వతముగా ఉండదు.
౧౫ సంపాదనకు తగ్గట్టుగా సెలవు చేస్తూ ఎంతో కొంత పొడుపు చేస్తున్దవలెను. పిల్లల వివాహమునకు చేర్చునది ఉద్యోగ విశ్రాంతి కాలమందు వచ్చిన ధనము తప్పకుండ గవర్నమెంట్ బ్యాంకు యందు మట్టుకే పెట్టుకోండి అధికమైన వడ్డీ ఇస్తారని వ్యాపారుల మాయ మాటలకు మోసపోయి మొదటికే నష్టము తెచ్చుకోకండి  ఎదుటి వారి మాయ మాటలకు లోన్గితే కుటుంబము గతి అధోగతి అయిపోను.
౧౬ ఎట్టి పరిస్తితి లోను నగలు అరువు తీసుకోకండి మీరు అరువు ఇవ్వకండి
౧౭ కుటుంబములో ఒకరికొకరు అనుసరణతో నడచుకో వలెను. తన మాటే నెగ్గాలని ప్రవర్తించ కూడదు. సత్ప్రవర్తన లేని భర్తను, ముక్కోపిని దుర్భాషలాడు భర్తను భార్య మంచి మార్గమునకు తన ప్రవర్తనతో తీసుకు రాగలదు.
౧౮ ఇంటి ముందరి హాలులోనే మంచి నీటి వసతి కల్పించుకోవడం చాల అవస్యము. నేటి కాలంలో మంచినీరు అడిగి తెచ్చేలోపు  ఎన్నో ఘాతుకములు జరిగిపోతున్నది. స్త్రీలు వృద్దులు ఒక్కరే ఇంటిలో ఉండేటప్పుడు తెలిసినవారని పోరుగువారని లోనికి వదలకూడదు. 
౧౯ పొరుగువారి ఎదుట మన ఇంటి వ్యవహారములను చర్చించ కూడదు. మన ఇంటి లోటు పాతులను యెంత సన్నిహితులైనను చర్చిన కూడదు. తన భర్త గురించో అత్తా మామల గురించో కోడలి గురించో ఇరుగు పొరుగు వారితో చర్చించ రాదు దీని వల్ల మనకు ఒరిగేది ఏమి లేదు కాక పొతే వారి వద్ద మనము చులకనై పోతాము.  
౨౦ దూర దర్శని సీరియల్స్ చూడకండి అవి మీ బుర్రలను నాశనము చేయును. మీ పిల్లల అభ్యుదయమే మీకు మొదటి కర్తవ్యము

Sunday, June 24, 2012

bhagavad geeta modati sloka arthamu

 
ధర్మ క్షేత్రే కురు క్షేత్రే సమవేతా యుయుత్సవః  మామకాః పాణ్డవాశ్చైవ కిమ కుర్వీత సంజయ
భగవద్గీత అర్థమంతయు ఈ స్లోకమందు నిక్షిప్తమయినదని చెప్తారు. క్షేత్రే ధర్మ క్షేత్రే  (సతి) కురు మామకాః పాండవస్చైవ సమవేతా యుయుత్సవః కి మకుర్వత 'సత్ జయ' అని అన్వయించుకుంటే క్షేత్రం అనే శరీరము ధర్మము ఆచరించుటకు యోగ్యమైనది అవుతుండగా కురు ధర్మము ఆచరించుము. ధర్మము ఎందుకు ఆచరించ వలయును అంటే ఈ శరీరమందు మామకాః మమకారములనే అహంకారములు రాజస తామస గుణములు పాణ్డవః  స్వచ్చమైన సాత్వీక వృత్తులు యుద్దమునకు సిద్దముగా ఉన్నది. ఆ రెండిటి అలజడిని తప్పించుకొనుటకు (కిమకుర్వీత) శాస్త్ర విహితములైన ధర్మములను ఆచరించ వలయును అనే అర్థము వస్తుంది.
గీతచార్యులు "తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్య వయస్తితౌ గ్యాన్త్వ శాస్త్ర విదానోక్తం కర్మ కర్తు మిహార్హసి"  అన్టే కార్య కార్య విషయములందు మనకు శాస్త్రమే ప్రమాణం కాబట్టి సాస్త్రమునందు చెప్పబడినట్టుగానే కర్మలను ఆచరించ వలయును. లౌకిక కర్మలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు  లౌకిక కర్మలు దేశ కాల పాత్ర వశముగా మారుతూ వుంటుంది. ఋషి ప్రోక్తములైన శాస్త్రములందు చెప్ప్పబడిన ధర్మములు అట్లు కాదు. సృష్టి నుండి ప్రళయము వరకు ఇహ పరమందు వాటి ప్రామాణ్యము స్థిరముగా వుంటుంది. మరియొకటి ఈ శ్లోకము అంతమందు   సంజయ అని ఉన్నది కదా దానిని మనము సన్ జయ అని పద విభాగముగా చెప్పుకుంటే శాస్త్ర విహిత కర్మలను ఫలాపేక్ష లేకుండా  ఆచరిస్తే మనము సన్ సత్పురుషులమై జయ జయము పొందగలము.  ఇక్కడ సన్ అనేది సత్ అనే పదానికి ప్రధమ ఏకవచనము కాబట్టి దానికి పవిత్రత అనే అర్థము వర్తిస్తుంది.   కటపయాది సంఖ్యా సాస్త్రమువల్ల జ వర్ణమునకు ౮ అని యా వర్ణమునకు ౧ అని సంకేతములు. విపరీతక్రమో ద్రష్టవ్యః అనే సూత్రము ప్రకారము ౮౧ పద్దేనిమిదిగా మారుతుంది.  ౧౮ జయమునకు సంకేతము.
 
మహా భారత మంగళా చరణ శ్లోకము " నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్"  ఇందు కుడా మనకు జయ సబ్దము కనిపిస్తుంది. భారతమునందు ౧౮ పర్వములు సేనలు ౧౮ అక్షౌహినిలు, భారత పోరు ౧౮ దినములు, భగద్గీత అధ్యాయములు ౧౮.  భారత మంగళా చరణ స్లోకమందు భగవద్ గీత మొదటి స్లోకమందు కుడా జయ సబ్దము మనకు కినిస్పిస్తుంది..  దీని ప్రాముఖ్యము ఎమవుతుందంటే అహంకారాదులను జయిస్తే కడపట జయము నిశ్చయము.  
భగవద్ గీత కడపటి శ్లోకము "యాత్ర యోగీస్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్రశ్రీ విజయో భుతిహి ద్రువనీతిర్ ర్మతిర్మమ" మనకు జయ సబ్దము కనిపిస్తుంది.  సకాలమందు దున్ని ఎరువు వేసి నీరు పట్టి కలుపు తీసి పరామర్శించిన కర్షకునకు శ్రమ లేకుండా పంట చేతికి అందివస్తుంది. అటులనే శరీరం అనే క్షేత్రం ధర్మా చరణమునకు అనువైమైనప్పుడు శాస్త్ర విహిత ధర్మము ఆచరిస్తే జయము సత్వరము లబిస్తుంది.
ధర్మ క్షేత్రే అనే శ్లోకమునకు పైన చెప్పు బడిన వ్యాఖ్యానము మీకు కొత్తదిగా వింతగా కనిపించినా అర్థ వంతముగా ఆశా జనకముగా వుంది కదా ఈశ్వరుని పొందుటకు అనేక మార్గములు ఉన్న విధముగానే గీత వ్యాఖ్యానము కుడా నీటి కొలది తామర అన్నట్లు మరియు గీతచార్యులు చెప్పినట్లు యో యో యం యం అన్నట్లు  మనము అనువర్తించు కొవచ్చును. మీకు ఇది అర్థవంతముగానే ఉండునని ఆశిస్తాను.

Friday, June 22, 2012

steelu cheya taginadi cheya kudanidi

                                       స్త్రీలు చేయ కూడనిది చేయ తగనితి - ౨
౧ అన్నము వడ్డించేటప్పుడు మొదట ఆకులో ఉప్పో లేక చర్కేరో అదిలేకపోతే కురముక్కలైన వడ్డించి పిదప అన్నము వడ్డించ వలెను  మొదట అన్నము వడ్డించి తర్వాత వ్యంజనములు వడ్డించేది స్రాద్హమందే.
౨ పొరుగువారి పడకలలో పండుకొన రాదు విడుదులలోనో కళ్యాణ మంటపములలోనో నిద్రించ వలసి వస్తే ఆ పడకలపైన మీ చీరనో లేక మీ భర్త దోవతియో పరచి దానిపైనే పండుకోనవలెను.అందువల్ల మనకు పడక దోషము అంటదు పడక దోషము అంటే ఇంకొకరు పండుకోనిన దాని  వల్ల వారి చెమట  అపాన వాయువు వదలటము సంభోగము వల్ల వచ్చిన దోషములు మనకు అంటవు.
౩ ఇంటి మొత్తానికి పడక గదులకు వారమునకు ఒక మారో లేక రెండు మార్లో సాంబ్రాణి పొగ దట్టముగా వేయవలెను దీని వల్లి సుక్ష్మ క్రిములన్ని నశించి పోవును.
౪ రాత్రి పండుకొనుటకు పోవునపుడు ముఖము కాళ్ళు చేతులు శుభ్రముగా మంచి నీటితొ కడుగుకొని తడిలేకుండా తుడుచుకొని లలాట సున్యము లేకుండా కుంకుమో లేక విభూతియో పెట్టుకొని శివనామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతముగా నిద్రించ వలెను.  ప్రొద్దున లేచేటప్పుడు విష్ణు నామము చెపుతూ లేవవలెను. దీనిని మీ ఇంటి యందు వుండే అందరు పాటించే విదముగా  చూసుకొనవలెను.
౫ ఎగ ఊపిరి అంటే దీర్ఘ శ్వాసము ఎప్పుడు వదలకూడదు  ఆవలించేటప్పుడు నోటికి అడ్డము పెట్టుకొని  ఆవలించవలెను అప్పుడు అరుపులు కూతలు చేయకూడదు.
౬ అత్తగారు మామ గారు భర్తతో పుట్టిన వారిని ఎప్పుడు విసుక్కోన రాదు. భర్త వారికి సహాయ సహకారములు చేస్తే మనము అడ్డుగా ఉండకూడదు అందు వల్ల వాళ్ళ శాపానికి గురికాకుండా ఉంటాము.
౭ వివాహానంతరము తన పుట్టింటి స్తితిగతులను అవగాహన చేసుకొని తనకు ఏదైనా కావాలంటే కోరాలి.  ఆలా కాకపొతే పుట్టింటి వాళ్ళు అమ్మాయి మనసుపడి అడిగిందని శక్తి మించి అప్పు చేసి మనకు కొనిచ్చి తర్వాత వారు బాధ పడుతుంటే ఏమి చేయలేని అసహాయ స్థితిలో ఉంటాము అందువల్లే అడిగే ముందు ఒకటికి పది సార్లు యోచించి అడగాలి.
౮ ఎదుటి వారి స్థితి గతులను గమనించే పక్వము మంకు వస్తే  ఒక కోరిక కోరేముందు బాగుగా యోచనచేసి అడుగగలము.
౯ భర్తపై అలిగో లేక కారణము లేకుండా పుట్టింటికి పోకూడదు తోచి తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళినట్లు.  దీనివల్ల మనకు రెండిల్లలోను  గౌరవ మర్యాదలు తగ్గిపోతుంది.
౧౦ నేటి స్త్రీకి దేనిని జీర్నించుకొనే శక్తి సామర్త్యములు చాల తక్కువ. ప్రతి చిన్న విషయమునకు బెంబేలు ఎత్తి పోవడము ఒక జాడ్యమై పోయింది. కష్ట నష్టములు మనుషులుకకు  కాక వేరెవరికీ రాదు దేనిని ధైర్యముగా ఎదుర్కొని జయించుకొని రావలెను.
౧౧ కుడి చేయి అనామిక  అంటే ఉంగరపు వేలి యందు బంగారు ఉంగరమును దరించ వలెను. ఆయుర్వేద శాస్త్రము ఆ వేలి నుండి వెళ్ళే నరము హృదయమునకు చేరుతుంది కాబట్టి బంగారు లోహమునకు హృదయ సంబంద రోగములను నిరోధించే గుణము ఉంది కాబట్టి అలా దరించ వలెను అని చెప్పింది
౧౨ గుమ్మడి కాయ ముక్కలు మార్కెట్టు నుంచి కొనుక్కుని వచ్చిన నాడు వండేయ వలెను లేకుంటే అది మనకు ఆరోగ్యానికి  చెడుపు చేస్తుంది
౧౩ ఎవరికైన అప్పు ఇవ్వవలనన్న సాయంకాలము దీపము పెట్టిన తర్వాత మరియు మంగళ శుక్ర వారములలో ఇవ్వరాదు
౧౪ పండ్లు తోమేటప్పుడు ఒకే స్తలమందు ఉండి తోమవలెను ఊరంతా తిరుగ రాదు ఇప్పుడు ఇది ఒక జాడ్యముగా తయారైనది
౧౫ గోళ్ళు ఎప్పుడు కొఱక రాదు.
౧౬ ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడకు వెళతారు అని అడగటమో లేక వెనకకు పిలవదమో లేక తుమ్మడమో లాంటివి చేయకూడదు
౧౭ డబ్బు బంగారు నగలను యెంత కోప ద్వేషములు ఉన్న విసర కూడదు దానిని అలక్ష్యము చేస్తే అది మనలను విడిచి వెళ్లి పోను 
౧౮ దీపము పెట్టిన తర్వాత పెను చూడడము, గుడ్డలు కుట్టడం, తలకు నునే రాచు కోవడం చేయ కూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానిన్చేదే 
౧౯ భర్త మగ పిల్లలు తులసి అధికము తినకుండా చుసుకోవలెను తులసి క్రిమి సంహారిణి మట్టుకే కాదు వీర్య నిర్జీవము కూడా చేస్తుంది తర్వాత కాలంలో పిల్లలు కలుగలేదని బాధపడడం గుళ్ళు గోపురాలకు తిరగడం చేయక్కరలేదు 
౨౦ చవితి చంద్రుని చూడకూడదు  కట్టుకునే గుడ్డలకు నిప్పు తగిలి కాలితే ఆ అవస్త్రములను త్యజించేయవలెను ఇంటిలో ఉంచుకోకూడదు 
౨౧ ఎడమ చేతితో పిల్లలను తోయడం తలలో కొట్టడం లాంటివి చేయకూడదు ఇంటి ఎదురుగా కుప్పను కుమ్మరించడం దానికి నిప్పు పెట్టడం లాంటివి చేయకూడదు
౨౨ పొద్దున్న లేవగానే ఇంటిలోని వెనుక ద్వారమునే తెరవవలెను అయ్యా మేము ఫ్లాట్లో ఉన్నాము వెనుక ద్వారం లేదు అంటే వెనుక ఉండే కిటికీ తెరిచి కొంతసేపటికి సింహ ద్వారమును తెరువవలెను
౨౩ చేతి నిండుగా ఎన్ని బంగారు గాజులు పెట్టుకొన్నాను ఆకు పచ్చ రంగు అద్దము గాజులను కూడా దరించ వలెను
౨౪ తిన్న తట్ట ఆకో ఎండ నివ్వ రాదు తినగానే ఎత్తేయ వలెను తిన్న తట్టను లేక ఆకును దాట రాదు వారు వారు తిన్న  తట్టలను ఎత్తి కడగడం కుటుంబములో చేయించ  వలెను
౨౫ పండుకున్న వాళ్ళను దాటి పోకూడదు.  వచ్చి కూర్చున్న తర్వాతే వడ్డించ వలెను
౨౬ భూమిపై రాస్తూ నడవటం భూమి అదిరేటట్టు నడవటం ఎన్నడు చేయకూడదు స్నానంతరం తుడుచుకున్న తువ్వాలును తలుపుపైన వెయ కూడదు ఇది దరిద్ర హేతువు అయితే మనవాళ్ళు దీనిని అలవాటుగా చేస్తున్నారు
౨౭ స్నానము చేసేటప్పుడు పాడటము మాటలాడడం నవ్వటం లాంటివి చేయకూడదు భగవన్నామము మనసులోనే జపిస్తూ స్నానము చేయవలెను నీటిలో నీడను చూడ రాదు
౨౮ ఉత్తరం లేక కాంక్రీట్ బీం కింద పండుకోనడమే సదవటం చేయకూడదు
౨౯ పడకలలో కూచొని తినడం ఒంటి చేత్తో పెట్టుకొని తినడం తిరుగుతూ తినడం ఒక తట్టలో పెట్టు కొని నలుగురు తినడం లాంటివి ఎన్నడు చేయకూడదు ఇది మహా దరిద్రాని సంబవింప చేయును అయితే ఇప్పుడు ప్రజానీకం దీనిని ఒక గొప్పగా చేస్తున్నారు పిదప కాలంలో అవస్త పడేటప్పుడు మనము చూడలేము కదా?
౩౦ అన్నము ఉప్పు నెయ్యి చేతితో వడ్డించ కూడదు గరిట తోనే వడ్డించాలి వద్దిన్చేతప్ప్పుడు చేతిలో గాజులు లేకుండా వడ్డించ కూడదు  తినేటప్పుడు మధ్యలో లేవకూడదు
౩౧ స్త్రీలు ఏళ్ళ వేళల మాంగల్య శ్లోకమును పటిస్తున్డాలి. ఇది సావిత్రికి అనసూయ ఉపదేశించిన శ్లోకము దీని ప్రభావము వలెనే సావిత్రి యముడినే మెప్పించి తన భర్త ప్రాణములను మరల పొందింది మీకు కూడా ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ మీరు కూడా ప్రార్తిసుంటే మీకు కూడా దీర్ఘ సౌమంగల్యము ఉంటుంది
 
    MANGALE MANGALAADHARE MAANGALYA MANGALAPRADE  MANGALAARTHAM MANGALESI MAANGALYAM DEHIME SAADAA
 
పై శ్లోకమును తెలుగులో అనువరించుటకు కుదర లేదు మంగలి అనే వస్తుంది అందువల్ల ఆంగ్లములో ఇచ్చాను. అర్థము  చేసుకుంటారు అని అను  కుంటాను
మరి కొన్ని రేపు చూస్తామ మరి ........ 

Thursday, June 21, 2012

స్త్రీలు చేయ తగిన చేయ కూడని పనులు

 స్త్రీలు చేయ తగిన చేయ కూడని పనులు
౧. స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదు ఎందుకంటె గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువ 
౨.గర్భిణి స్త్రీలు శూర టెంకాయ తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అడురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు 
౩ గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్నమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు 
౪ మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును 
౫ మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను
౬ మీరు మీ పిల్లలో దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరు దీనిని తప్పక చేస్తుంటారు 
౭ స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు 
౮ దుక్కము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు అలాగే వారు పోయేటప్పుడు వెల్లివస్తానని చెప్పా కూడదు ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారినిని రండి రండి అంది సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి పోర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు పరోక్షముగా మనము అశుభములను కోరుదోవడానికి ఇది నాంది అవుతుంది 
౯ కోత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక ముల రాయాలి పసుపు క్రిమి నాసిని 
౧౦ ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది
౧౧ నలుపు రంగు వస్తువులు బట్టలు దరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది 
౧౨ ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము 
౧౩ ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి ఇది పితృ దేవతలకు ప్రీతి కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది 
౧౪ టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను 
౧౫ స్త్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది 
౧౬ సుక్రవారమునాడు గాని జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పైపై డబ్బులు చేరటానికి అవకాసము ఎక్కువ 
౧౭ కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాల్లాడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ 
౧౮ ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ఎడమ చేతిని ఉపయోగించ కూడదు 
౧౯ సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు 
౨౦ స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు 
౨౧ పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు రేపు తీసుకుంటాను అని అనవలెను 
౨౨ ఎప్పుడు మన నోటినుండి పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు 
౨౩ ఇంటిలో దుమ్ము ధూలి సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను 
౨౪ స్రాద్హ దినమందు ఇంటి ముందు ముగ్గు స్రాద్హము అయ్యేవరకు వేయకూడదు స్రాద్హనంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను 
౨౫ దిండు ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాళ్ళ మనకు హాని జరుగును 

Wednesday, June 20, 2012

ladies mentality

స్త్రీల మానసిక స్థితి
కొంత కాలము క్రితము వరకు స్త్రీలకూ వారి శక్తి యుక్తులు తెలియకుండానే ఉండిపోయింది. వాళ్ళకు వల్లే బలహీనులు అని వాపోవుచున్దిరి. ప్రమంచము తెలియదు అని ఇంటిలోపే వంటింట్లో కుందేలు లా కాలము వెళ్ళ పెట్టుతున్దిరి. నేటి పరిస్థితి వేరు స్త్రీకి తన శక్తి సామర్త్యములు తెలియ వచ్చినది. అయిన ఇంకను బలహీనత పోలేదు. తానూ చేసేది సరి తప్పు అని యోచన చేయుటకు వారి మనస్సు అంగీకరిచడం లేదు. తన నిర్ణయమే సరి అని తలంప చేయిన్చుచున్నది. ఈ స్థితి చాలా అక్రుత్యములు చేయించు చున్నది. ఉదాహరణకు అత్తగారు, కోడలు, వదిన, ఆడబిడ్డ. 
అత్తగారు కోడలిని, ఆడబిడ్డ వదినగారిని వేదించడం తగ్గ లేదు. స్త్రీయే స్త్రీకి శత్రువుగా వుంది. దీనివల్ల, తన సమయము వరకు వేచి యుండి తానూ వేదిమ్పబడినది కావున తన వంతుకు అత్తగారి కడపటి కాలంలో ప్రత్యక్ష నరకము చూపించడానికి హేతువు అవుతుంది. ఒకటి ఇరువురు మరచి పోతారు అదియే పాపము మూట కట్టుకోవడం. దీని పరిణామం వేరొక జన్మలో దీన పరిస్థితిలో వుండు కుటుంబములో జన్మ ఎత్తి మరల అవస్స్తలకు గురి కావడం. ఈ స్త్తితి మరచి పోయి తప్పులు చేస్తూ వుంటారు.
కొంత కాలానికి మనకు మట్టుకు ఎందుకు ఈ దీనస్థితి ఇంత కష్టాలు భగవంతుడు ఇచ్చాడు అని వాపోతారు.  కారణము లేక కార్యము వుండదు అనే విషయము మర్చి పోతాము. మనము పొరుగు వాళ్ళను అవస్తకు గురి చేస్తే నేడు మనము అవాస్తాలకు గురి అవుతామని యోచిన్చరు. దేవుడు ఎవరికి కష్టములు ఇస్తాడు ఇంకొకరి కష్టములు ఇచ్చిన వారికే తప్ప.
మనమే కాష్టములను కొని తెచ్చుకొంటాము. దీన పరిస్థితి ఎదుటివారి వల్ల రాదు. దీనికి మార్గమేమి.
అత్తగారో కొడలో ఆడబిద్దో వదినగారో అందరు స్త్రీలే అనే గౌరవించే మనస్సు రావాలి. ప్రతి ఒక్కరు మాటలు చేష్టలతో వ్యన్గ్యముగా బాధించ కూడదు.  ధన దాన్యములతో సిరి సంపదలతో జీవితమూ గడపాలంటే ఎదుటి వారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ మనము గోవరవిమ్పబడుతూ జీవితమూ గడపాలి.
చెప్ప వలసినది చెప్పియే తీరవలెను. మరి సాత్వీకముగా వుంటే మన పరస్థితి మారిపోతుంది. దేవుడు గుళ్ళకు వెల్లడము, వ్రతాలు పూజలు చేయడం వల్లనే మనలను కరుణించ లేరు ప్రేమ సాత్వీక జీవితముతో సాగిస్తేనే తన కృప దొరుకుతుంది
ప్రతి స్త్రీ దీనిని బాగుగా మనస్సుకు అర్థము చేసుకొని ఎదుటి వారికి గౌరవ మర్యాదలు పంచుతూ తానూ పొందుతూ అత్యవసరమైతే తగినంత మాత్రము చురకలు అందిస్తూ బతకాలని అప్పుడే మీ జేవితము మూడు పూలు ఆరు కాయలుగా సాగగలదని నా అభిప్రాయము
ప్రతి రోజు స్త్రీ దేవుని ముంది స్నానము అనంతరం ఈ కింది శ్లోకము చెప్పి నమస్కరిస్తుంటే అవైధవ్యము రానే రాదు
ఓంకార పుర్వికే దేవి వీణా పుస్తక ధారిణి, వేద మాతా నమస్తుబ్యం అవైధవ్యంచ  ప్రయచ్చమే
పతివ్రతే మహాభాగే భర్తుస్చ ప్రియవాదిని అవైధవ్యంచ సౌభాగ్యం దేహిత్వం మమ సువ్రుతే
పుత్రాన్ పౌత్రాంచ సౌఖ్యంచ సౌమాన్గాల్యంచ దేహిమే