సుఖ దుఖములు పుణ్య పాపములు
ఈ జన్మలో మనము అనుభవించే సుఖ దుఖములకు మనము చేసుకొన్న పుణ్య పాపములే నాంది. ఒక తల్లి సంతానములోనే ఒక్కొక్కరు ఒక్కో స్టితి గతులతో జీవించడం మనము చూస్తున్న నిదర్సనం. పాండవులు అరణ్యవాసమందు కష్టములు అనుభవించిన అది వారికి సాధకముగానే మారినది కదా. రాజ్యము సిరి సంపదలు లేకపోయినను పాండవులు అరణ్యవాసమందు వేయి బ్రామ్హలకు అన్నపానాదులతో అతిథి సత్కారములు సూర్య అనుగ్రహమువల్ల లభించిన అక్షయ పాత్ర ఆధారముగా పోషించుచున్దిరి. ఒకానొకప్పుడు దుర్యోధనాదులు ఆటవిక జాతివారికి బందియితే పాండవులు కాపాడినారు కదా. అరణ్యవాసమైన సుఖ సంతోషములతో కాలము గడిపినారు. కష్టములు వచ్చినను అదియు మన మంచికే అనే భావనతో గడిపినారు. అర్జునునకు ఊర్వసి శాపము వల్ల నపుమ్సకుడుగా కావలసివస్తే దానిని అన్గ్యాత వాసమందు బృహన్నలగా తీసుకొని సంతోషముగా అనుభవించ లేదా. భీమసేనునకు దుర్యోదనాదులు చాల కష్టములు పెట్టలేదా విషాన్నము పెట్టి మూర్చ పోయినప్పుడు పాషాణము నడుముకు కట్టి నదిలోకి తోసివేస్తే భీముడు పాతాళలోకానికి వెళ్లి వాసుకి అతిథిగా ఉండి అమృతము సేవించి పదివేల ఏనుగుల బల పరాక్రమములతో తిరిగి వచ్చెను కదా. ధర్మముదా భీముని రక్షించినది దుర్యోధనుని పురుష ప్రయత్నము వ్యర్థమేకద.
ఒక బ్రామ్హనుడు ఒక అస్వథ వృక్షమును ప్రదక్షిణము చేస్తుంటే అతనిని ఒక నల్ల తెలు కుట్టింది ఒక దుష్టుడు దీనిని చూసి ఆ వృక్షమును సతవిధములుగా తిట్టి కాలితో తన్ని పోయేటప్పుడు అతనికి ఒక స్వర్ణ నాణెము దొరికినది దానిని తీసుకొని ఆతను వెళ్ళిపోయెను బ్రామ్హదు యోచించి చుండెను మనము సత్కార్యము చేస్తుంటే మనకు దుఃఖము సంభవించినది దుష్టుడు తప్పిదము చేసినను అతనికి ధనము ప్రాప్తించినది ఎందువల్ల అని తన దీర్ఘ దృష్టి ద్వారా చుస్తే తనకు మరణము సంభావించ వలసినది ఒక తేలు కాటుతో సరిపోయింది దుష్టినికి అధిక ధనము ప్రాప్తించవలసిన దానికి ఒక స్వర్ణ నాణెముతో సరిపోయింది అనేది తెలుసుకొనెను అందువల్ల కష్టము వల్ల దుఃఖము సంప్రాప్తమయితే తన పాప కర్మలు దుఃఖముతో తీరిపోయినది అని సంతోషించవలెను.
ఈ బుద్ది తోనే కుంతీదేవి శ్రీకృష్ణుని నాకు ఎల్లప్పుడు కష్టములే సంప్రాతిమ్పచేసి సదా సర్వ కాలము నా మనసు నీ పాదపద్మములందే నిబిడి క్రుతము కావలెనని కోరినది సదా సర్వకాలము భాగవత్ధ్యానము చేసేవారికి దుఖములు ఎందుకు సంప్రాప్తిస్తుంది.
ప్రహ్లాదుని విషయము తీసుకొంటే తెలుస్తుంది. మనకు చిన్న చీమ కుడితే ఏంటో భాద అనుభవిస్తాము మరి ప్రహ్లాదునికి సంప్రాప్తించిన దుఖములకు లెక్క ఉందా పర్వత సిఖరమునుండి క్రిందికి తోయిన్చినారు విష సర్పములచేత కాటు వేయిన్చినారు ఎనుగులచేత తోక్కిన్చినారు విషపానము చేయించినారు అయినను ప్రహ్లాదునికి దేనివల్లను కష్టములు సంభవించ లేదుకదా ఎందువల్ల భగవత్ భక్తీ వల్ల పాప నాశనము అవడము వల్ల పాప ఫలమైన దుఃఖము ఏర్పడలేదు
ఇందువల్ల మనకు ఏర్పడు సుఖ దుఖములకు మనము చేసుకొన్న పుణ్య పాపములే కారణము అవుతుంది
No comments:
Post a Comment