music

mp3 format files

Sunday, July 15, 2012

patni yetupakka undavalenu

భార్య పురుషునికి శుభ కర్మలందు ఎటు కూర్చునేది అనేది ఒక తీరని జాడ్యముగా తయారైనది. పండితులు పామరులకు ఇది ఒక తీరని సమస్యగానే తయారైనది. కొందరు ఎడమ ప్రక్క కొందరు కుడి పరక్క అని వాద వివాదాములకు దిగెదరు. శ్రీ కృష్ణుడు భగవద్గీత ౧౭వ  అధ్యాయమందు శ్లోకములు ౫ ౧౧ ౧౩లొ యన్గ్య యాగాదులందు వేద శాస్త్రములందు చెప్పిన రీతిగా చేయకుంటే అది తామసిక క్రియగా మారి దుష్పలితములను పొందచేయును అన్నారు. దీనికి మూడు ముఖ్య కారణములను పరిసీలిస్తాము
౧. యన్గ్య యాగాది క్రియల్లో ఏటుల జరిపితే మనకు మంచి ఫలితము లబించును  ౨. మనము ఏ ప్రాంతములో నివసిస్తున్నాము అనేది. ఇది క్రమేణ వలస మార్పులవలన ఏది సరైనది అని నిర్ధారించ లేకున్నాము. ౩. మన కులాచారము చుద్దామంటే అది శాస్త్ర సమ్మతమైనదా దానికి అనేది లేక వారి వారి సౌకుర్యార్థము మార్చుకున్నారా అని పరిశీలించ వలయును.
వివాహ సంస్కారమందు వాగ్దానమంతరము అమ్మాయిని అబ్బాయికి ఎడమవైపుకు మార్చ్ కుర్చోమంటారు. 
కొంతమంది అమ్మాయి అబ్బైకి కుడి వైపున వుంటే పూజా పునస్కారములందు అందించుటకు సులభముగా ఉండుట వల్ల ఆలా కూర్చోవచ్చును అంటారు. కొంతమంది హృదయము వామ భాగమందు వుంది దానిని అమ్మాయికి సమర్పించుట వల్ల అని అంటారు. మనము ఇప్పుడు శాస్త్రము ఏమి ప్రమాణము అందించిందో చూస్తాము.
౧. మాధవాచార్య ప్రణీత సంస్కార విధి యందు "యన్గ్యే హొమే వ్రతే దానే స్నాన పూజాది కర్మణి దేవయాత్రా వివాహేషు పత్ని దక్షిణత శుభా" అంటే యన్గ్యము, హోమము, వ్రతము, దానము, దేవపుజా, యాత్ర, వివాహాది కర్మలను పత్ని కుడి ప్రక్కన ఉంటె శుభాదాయకము మరియు ఆశీర్వాదము అభిషేకము లందు పత్ని ఎడమవైపుకు ఉండవలనన్నది ఎందుకంటె భర్త తూర్పు దిక్కుగా వుండి సంస్కారములు చేయునప్పుడు దక్షిణము వైపు ఉంది ఆశీస్సులు తీసుకోకూడదు
౨. శిష్ట స్మ్రుతి యందు "అసీర్వాదే అభిషేకేచ పాద ప్రక్షాలనే తథా శయనే భోజనే చైవ పత్నీ తత్ ఉత్తరతో భవేత్" అంటే ఆశీస్సులు అందుకునేటప్పుడు బ్రామ్హలకు కళ్ళు కడిగేటప్పుడు భోజనమందు సయనిన్చేతప్పుడు వామ భాగామునందే ఉండవలయును.
౩. ఉపనయన సంస్కారమందు "జన్మదినే పుత్రకలత్ర సహితే యజమానే మంగళ ద్రవ్యయుత జలేన స్నాత్వ వాససి భుషనానిచ ద్రుత్వా కృత మంగళకో మాత పితృ గురు ఆచార్య కులదేవతా విప్రాన్ ప్రణమ్య గ్రుహాన్తే సుభాసనే ప్రాంక్ముఖో ఉపవిశ్య సాధ్హక్షినతో పత్నీం తస్యా దక్షిణతో బాలం ...."  అంటే ఉపనయన జన్మదిన చౌల తదితర సంస్కారములందు పత్నీ పుత్రా సహితముగా మంగళ స్నానములు గావించుకొని నూతన వస్త్రములు ధరించి తల్లి తండ్రి గురువు ఆచార్య కులదేవత విప్రులకు నమస్కరించి తూర్పు ముకఃముగా తానూ పత్ని దక్షిణముగా కుమారుడు పత్నికి దక్షిణముగా కుర్చుని సంస్కారములు చేయవలయును. 
౪. రామాయణములో "సీమంతెచ వివాహేచ చతుర్యా సహభోజనే  వ్రతే దానే మఖే శ్రాదే పత్నీం తిష్టంతి దక్షిణే"  అంటే సీమంతము, వివాహము చతుర్తి భోజనమందు వ్రాత, దాన, హోమం స్రాద్దాదులలో పత్ని దక్షిణముగా ఉండవలెను
౫ వసిష్ఠ హవాన విదానమందు "తతోభిషేకం కుర్యాత్ అత్ర పత్నీ వామతః రుద్ర కలశ పల్లవోదిహి సకలత్ర మభిశించేత్"
౬ పాణిని పుస్తకం ౪ ౧  అధ్యయము  సూత్రము ౩౩ "పత్యుర్నో యన్గ్య సయోగే యందు కార్యా కార్యాదుల ననుసరించే వామ దక్షిణ భాగములలో కూర్చోన వలెనని చెప్పి ఉన్నది
౭ శ్రీరాముడు అశ్వమేధ యాగమందు సీత ప్రత్యక్షముగా లేనందువల్ల కాంచన సీతను కుడి ప్రక్కన్ పెట్టుకొని నిర్వహించినట్టు రామాయణము చెపుతోంది.
౮ సర్వకర్మ అనుష్టాన ప్రకాశిక అనే పుస్తకమందు యన్గ్య యాగా పూజ వ్రతాదులందు దక్షినముగాను అభిషేకము, పాద ప్రక్షాళనము నిద్ర భోజనాడులందు వామ భాగమందు ఉండాలని నిర్దేసిన్చ్ చెప్పింది.
౯ నిత్ర్య కర్మ పూజా ప్రకాశిక యన్డుకుడా అలానే చెప్ప బడింది
౧౦మహా శివ పురనమందు శివ పార్వతి కళ్యాణ సమయమందు మైనా దేవి అదే హిమవంతుని భార్య శివుని కాళ్ళు కడిగేటప్పుడు కుడి ప్రక్కకు మారి వచ్చి నట్లు చెప్పబడింది
౧౧ హిరణ్యకేసీయ గృహ్య సుత్రమందు "అగ్ని ముపస మాదాయ దక్షినతః పాటి భార్యోప విస్యతి" అని చెప్ప బడింది ఇది యజుస్సాఖీయులకు వర్తిస్తుంది
౧౨ ఖాదిర గృహ్య సూత్రం పానిగ్రహస్య దక్షిణత ఉపవేసఎత్ అనియు
౧౩ జైమినీయ గృహ్య సుత్రమనందు దక్షిణత ఎకాయం భార్యముపవేస్యోతరతః పతిహి అని
౧౪ ధర్మ ప్రవ్రుత్తి యందు ఆశీర్వాద అభిషేకేచ పాద ప్రక్షాలనే తథా శయనే భోజనే చైవ పత్నీ తత్ ఉత్తరతో భవేత్ అని
౧౫ సంస్కార గణపతి యందు వామే సిందూర్ దానేచ్ వామే చైవ ద్విరాగమే వామే సనికస్యాయంస్చ భావేజ్జయప్రియార్తిని అని
౧౬ వ్యాగ్రపాడ స్మ్రుతి "కన్యా దానే వివాహేచ ప్రతిష్టా యన్గ్యకర్మని సర్వేషు ధర్మ కార్యేషు పత్ని దక్షిణత స్మ్రుత  దక్షిణే వసతి పత్ని హవానే దేవతార్చనే సుశ్రుష రతి కాలేచ వామ భాగే పసస్యతే  శ్రాదే పత్నీచ వామంకే పాదప్రక్షలనే తథా నాంది స్రాదేచ సోమేచ మధుపర్కేచ దక్షిణే  అని 
౧౭ అత్రి స్మ్రుతి యందు జీవత్ భర్తరి వామంకే మృతే వాపి సుదక్షినే శ్రాద యన్గ్య వివాహేచ పత్ని దక్షినతః సదా అని 
18 గోబిల గృహ్య సుత్రమందు పూర్వే కటంటే దక్షినతః పాణి గ్రహస్యోపవిష్యతి దక్షినేనే పాణినా దక్షినమసమంవాబ్దాయః షడ్జ్యాహుతి జుహోతి అని 
౧౯ ఆశ్వలాయన గృహ్య సుత్రమందు దంపతితు వ్రాజేయాతాం హోమార్య చైవ వేదికాం వాస్య దక్షిణే భాగే తాం వాదు ఉపవేసయత్ అని ఎలా ఎన్నో చూపించ వచ్చును. 
ఇందుములముగా మన శాస్త్రములందు కొన్ని కార్యాడులందు దక్షిణముగా కొన్ని కార్యాడులందు వామముగా వుండవలనని సుస్థిరముగా చెప్ప బడి ఉన్నది. మన ఋషులు మునులు తప్పుగా చెప్పరు
మనవాళ్ళు కొంతమంది వితండ వాదమునకు దేవునికి ఎడమ భాగాములోడా అమ్మవారు ఉండే అనవచ్చును కొంచము ఆలోచించడి అనుగ్రమునకు దేవి వామ భాగామండుడా ఉండవలెను కాని పైన చెప్పబడిని కార్యములందు ఎలా ఉండవలయునని మనకు సూత్రములు చెప్పివుంది కదా. 
శివుడు భార్యను వామ భాగములో పెట్టుకున్నదే అంటే వివాహ సమయములో యెట్లు ఉండేనో మీరు ఆలయ సిలపములు చుడండి శివునికి దక్షిణముగా పార్వతి తధక్షినముగా విష్ణువు కన్యాదానము చేయు శిల్పములు చూడలేదా? 
కాదు కూడదు మేము వామ భాగాములోనే పెట్టుకొని అన్ని కార్యములు చేస్తామంటే మీకు సంస్కార ఫలితములు లభ్యమవవు ధన క్షయము తప్ప ఇప్పటికైనా సరి చేసుకొని మంచి బ్రంహనులుగా తయారై మీరు బాగుపడి దేశమును బాగుపర్చండి. ఇంత కంటే  ఇక చెప్పడానికి ఏమి లేదు.

No comments:

Post a Comment