music

mp3 format files

Monday, July 2, 2012

vyaasa pournami - vyaasana janma vruttantamu

గురు పౌర్ణమి
వ్యాసాయ విష్ణు రూపాయ  వ్యాస రూపాయ  విష్ణవే  అని భీష్ముడు స్తుతించిన విధముగా వ్యాస మహర్షి పూజ  ఆషాడ  పౌర్ణమి రొజున చేస్తాము . వ్యాసుడు  పరాశర  మహర్షి కుమారుదు శక్తి  మహర్షి మనమడు,వసిష్టుని  ముమ్మనవడు.పరాశరడు త్రిలోక  పుజ్యుడు మద  మాత్సర్యములు లెకుండ మహా తపస్వి తెజోవంతుడు గుణ  సంపన్నుడు. ఒకపరి తీర్థయాత్రలకు బయలుదేరి యమున సమీపమునకు వచ్హి నది దాటుటకు మత్స్యగంధి నావలొ యెక్కెను. మత్స్యగంధి దాసరాజు కుమార్తె మత్స్య కులమునకు చెందినది. నావ యమున మధ్యకు వచ్హినది. ఫరశరునకు మత్స్య గంధి పైన మక్కువైనది అది తనకు తెలిపెను . తాను మత్స్య కులమునకు చెందినది అంటే పర్లేదు అనెను తన దేహము చాపల దుర్గంధముతొ ఉన్నది అంటె పరాశరడు తనను యొజన గంధిగా మార్చెను.తన కన్యాత్వము చెడును అంటె  కన్యాత్వాము చెడకుండా వుండెటట్లు వరము  ఇచ్హెను.  ఆప్పుడు  సూర్యుడు నడి నెత్తిన వుండటము  వల్ల తనకు సిగ్గుగా వున్నదన్నది అంటే పరాశరుడు  మంచుతొ ఒక ద్వీపమును యమున మధ్యలొ స్రుష్టించి తనతొ రమించి సధ్యొ గర్భము వల్ల ఒక కుమారుని ప్రసివింపచేసెను  . ఆ పిల్లవాడే  వ్యాసుడు పరాశరుడు సత్యవతిని చూసి ఆనందించి పిల్లవానిని చూసి మురిసిపొయి తన దొవన తాను వెల్లిపొయినాడు   వ్యాసుడు  చీకటి  ద్వీపమున జన్మించినందు వల్ల క్రిష్ణ ద్వైపాయనుడుగా పేరు కల్గెను.  అంతటితొ పరాశరుడు తన దారిలొ  వెల్లిపొయెను.  వ్యాసుడు తల్లికి నమస్కరించి తాను యెప్పుడు  తలచిన  తన వద్దకు వచ్హెదనని తపస్సుకై వెల్లిపొయెను. వ్యాసుడు మనకు పరాశరుని మూలముగా చెప్పవచ్హినది మనుజులు స్త్రీ సాంగత్యము కొరకు యెంత క్రిందికైన దిగజారుతారు తస్మాత్ జాగ్రత.  భారతము పంచమ వేదముగ వేద ఉపనిషత్తుల ధర్మ సాస్త్రములను సమీకరించి ఒక కథారూపమున అందించినాడు  మహాతపస్వి. ప్రతి పాత్ర ద్వారా మనకు ఒక సందేశము   అందించి మనకు మన సంస్క్రుతికి చాల గొప్ప సేవ  చేసిన మహానుభావుడు    ప్రతి పాత్రలొ మనకు అందించిన సందెశము   యెమిటొ  ముందుముందు చుద్దాము  మరి. మహనీయులు ప్రతిఫలా పేక్ష  లేకుండా  మంకు యెంతొ మేలు చెసారు.                        

No comments:

Post a Comment