ధర్మ క్షేత్రే కురు క్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాణ్డవాశ్చైవ కిమ కుర్వీత సంజయ
భగవద్గీత అర్థమంతయు ఈ స్లోకమందు నిక్షిప్తమయినదని చెప్తారు. క్షేత్రే ధర్మ క్షేత్రే (సతి) కురు మామకాః పాండవస్చైవ సమవేతా యుయుత్సవః కి మకుర్వత 'సత్ జయ' అని అన్వయించుకుంటే క్షేత్రం అనే శరీరము ధర్మము ఆచరించుటకు యోగ్యమైనది అవుతుండగా కురు ధర్మము ఆచరించుము. ధర్మము ఎందుకు ఆచరించ వలయును అంటే ఈ శరీరమందు మామకాః మమకారములనే అహంకారములు రాజస తామస గుణములు పాణ్డవః స్వచ్చమైన సాత్వీక వృత్తులు యుద్దమునకు సిద్దముగా ఉన్నది. ఆ రెండిటి అలజడిని తప్పించుకొనుటకు (కిమకుర్వీత) శాస్త్ర విహితములైన ధర్మములను ఆచరించ వలయును అనే అర్థము వస్తుంది.
గీతచార్యులు "తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్య వయస్తితౌ గ్యాన్త్వ శాస్త్ర విదానోక్తం కర్మ కర్తు మిహార్హసి" అన్టే కార్య కార్య విషయములందు మనకు శాస్త్రమే ప్రమాణం కాబట్టి సాస్త్రమునందు చెప్పబడినట్టుగానే కర్మలను ఆచరించ వలయును. లౌకిక కర్మలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు లౌకిక కర్మలు దేశ కాల పాత్ర వశముగా మారుతూ వుంటుంది. ఋషి ప్రోక్తములైన శాస్త్రములందు చెప్ప్పబడిన ధర్మములు అట్లు కాదు. సృష్టి నుండి ప్రళయము వరకు ఇహ పరమందు వాటి ప్రామాణ్యము స్థిరముగా వుంటుంది. మరియొకటి ఈ శ్లోకము అంతమందు సంజయ అని ఉన్నది కదా దానిని మనము సన్ జయ అని పద విభాగముగా చెప్పుకుంటే శాస్త్ర విహిత కర్మలను ఫలాపేక్ష లేకుండా ఆచరిస్తే మనము సన్ సత్పురుషులమై జయ జయము పొందగలము. ఇక్కడ సన్ అనేది సత్ అనే పదానికి ప్రధమ ఏకవచనము కాబట్టి దానికి పవిత్రత అనే అర్థము వర్తిస్తుంది. కటపయాది సంఖ్యా సాస్త్రమువల్ల జ వర్ణమునకు ౮ అని యా వర్ణమునకు ౧ అని సంకేతములు. విపరీతక్రమో ద్రష్టవ్యః అనే సూత్రము ప్రకారము ౮౧ పద్దేనిమిదిగా మారుతుంది. ౧౮ జయమునకు సంకేతము.
మహా భారత మంగళా చరణ శ్లోకము " నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్" ఇందు కుడా మనకు జయ సబ్దము కనిపిస్తుంది. భారతమునందు ౧౮ పర్వములు సేనలు ౧౮ అక్షౌహినిలు, భారత పోరు ౧౮ దినములు, భగద్గీత అధ్యాయములు ౧౮. భారత మంగళా చరణ స్లోకమందు భగవద్ గీత మొదటి స్లోకమందు కుడా జయ సబ్దము మనకు కినిస్పిస్తుంది.. దీని ప్రాముఖ్యము ఎమవుతుందంటే అహంకారాదులను జయిస్తే కడపట జయము నిశ్చయము.
భగవద్ గీత కడపటి శ్లోకము "యాత్ర యోగీస్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్రశ్రీ విజయో భుతిహి ద్రువనీతిర్ ర్మతిర్మమ" మనకు జయ సబ్దము కనిపిస్తుంది. సకాలమందు దున్ని ఎరువు వేసి నీరు పట్టి కలుపు తీసి పరామర్శించిన కర్షకునకు శ్రమ లేకుండా పంట చేతికి అందివస్తుంది. అటులనే శరీరం అనే క్షేత్రం ధర్మా చరణమునకు అనువైమైనప్పుడు శాస్త్ర విహిత ధర్మము ఆచరిస్తే జయము సత్వరము లబిస్తుంది.
ధర్మ క్షేత్రే అనే శ్లోకమునకు పైన చెప్పు బడిన వ్యాఖ్యానము మీకు కొత్తదిగా వింతగా కనిపించినా అర్థ వంతముగా ఆశా జనకముగా వుంది కదా ఈశ్వరుని పొందుటకు అనేక మార్గములు ఉన్న విధముగానే గీత వ్యాఖ్యానము కుడా నీటి కొలది తామర అన్నట్లు మరియు గీతచార్యులు చెప్పినట్లు యో యో యం యం అన్నట్లు మనము అనువర్తించు కొవచ్చును. మీకు ఇది అర్థవంతముగానే ఉండునని ఆశిస్తాను.
No comments:
Post a Comment