ఆషాఢ శుక్ల ఏకాదశి మనము శయన ఏకాదశి అని వ్రతము ఆచరిస్తాము. దీనినే దేవ శయన ఏకాదశి ఆషాడ ఎకదాసి లేక విష్ణు శయన ఏకాదశి లేక హరి వాసర ఏకాదశి లేక పెద్ద ఏకాదశి లేక తొలి ఏకాదశి అని కూడా అంటాము. ఈ వ్రత విధానము భవిష్యోత్తర పురాణములో యుదిష్టురునకు శ్రీకృష్ణుడు చెప్పిన విదానముగా ఉన్నది.
పూర్వ కాలములో ఇక్ష్వాకు వంశములో మాంధాత అను చక్రవర్తి అయోధ్య నగరాన్ని పరిపాలిస్తుండెను. అతను రాజ్య పాలన బహు దార్మికముగా చేస్తూ ప్రజలను కన్నా బిడ్డల వలె కంటికి రెప్పల కాపాడుతూ రాజ్య పాలన జరుపుతూ ఉండెను. కొంత కాలమునకు అతని రాజ్యములో తీవ్రమైన కరువు సంభవించెను. ప్రజలు త్రాగుటకు కూడా నీరు దొరకక అవాస్త పడుతున్దిరి నీరు లేని కారణమున దేవ రుషి పితృ ప్రీతి కార్యములకు భంగము వాటిల్లినది. ప్రజలు క్లిష్టపరిస్తితిని రాజుకు విన్నవించుకుని తగిన పరిహారములు చేయించ మని వేడిరి .
మాంధాత చక్రవర్తి అంగిరస మునిని ప్రార్తించిన మీదట అతను ఆషాడ శుద్ద ఏకాదశి రోజున మాహవిష్ణుని శ్రద్హతో పూజించి పూర్తిగా ఉపవాసము ఉంది ద్వాదశి రోజున పార్వణ చేసిన దేశము సుభిక్షముగా ఉంటుందని అదేసించెను మాంధాత చక్రవర్తి తానూ తన ప్రజలతో కుడా ఈ వ్రతము జరుపుకొని సకాలములో వర్షములు కురిసి పంటలు బాగుగా పండి అన్ని క్రతువులు జరుపుకొంటూ సంతోషముగా ఉండిరి.
మనము కుడా ఆషాడ శుద్హ ఎదాదసి నాడు ఉపవాసము ఉంది మహా విష్ణును పూజిస్తే మనకు కుడా అన్ని సంరుద్హిగా లభిస్తుందని పెద్దల వాక్కు.
ఉపవాసము ఉండకపోయిన విష్ణు సహస్రాన్ని అయిన ప్రొద్దుట సాయంకాలము భక్తితో చదవండి ......
No comments:
Post a Comment