స్త్రీలు చేయ కూడనిది చేయ తగనితి - ౨
౧ అన్నము వడ్డించేటప్పుడు మొదట ఆకులో ఉప్పో లేక చర్కేరో అదిలేకపోతే కురముక్కలైన వడ్డించి పిదప అన్నము వడ్డించ వలెను మొదట అన్నము వడ్డించి తర్వాత వ్యంజనములు వడ్డించేది స్రాద్హమందే.
౨ పొరుగువారి పడకలలో పండుకొన రాదు విడుదులలోనో కళ్యాణ మంటపములలోనో నిద్రించ వలసి వస్తే ఆ పడకలపైన మీ చీరనో లేక మీ భర్త దోవతియో పరచి దానిపైనే పండుకోనవలెను.అందువల్ల మనకు పడక దోషము అంటదు పడక దోషము అంటే ఇంకొకరు పండుకోనిన దాని వల్ల వారి చెమట అపాన వాయువు వదలటము సంభోగము వల్ల వచ్చిన దోషములు మనకు అంటవు.
౩ ఇంటి మొత్తానికి పడక గదులకు వారమునకు ఒక మారో లేక రెండు మార్లో సాంబ్రాణి పొగ దట్టముగా వేయవలెను దీని వల్లి సుక్ష్మ క్రిములన్ని నశించి పోవును.
౪ రాత్రి పండుకొనుటకు పోవునపుడు ముఖము కాళ్ళు చేతులు శుభ్రముగా మంచి నీటితొ కడుగుకొని తడిలేకుండా తుడుచుకొని లలాట సున్యము లేకుండా కుంకుమో లేక విభూతియో పెట్టుకొని శివనామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతముగా నిద్రించ వలెను. ప్రొద్దున లేచేటప్పుడు విష్ణు నామము చెపుతూ లేవవలెను. దీనిని మీ ఇంటి యందు వుండే అందరు పాటించే విదముగా చూసుకొనవలెను.
౫ ఎగ ఊపిరి అంటే దీర్ఘ శ్వాసము ఎప్పుడు వదలకూడదు ఆవలించేటప్పుడు నోటికి అడ్డము పెట్టుకొని ఆవలించవలెను అప్పుడు అరుపులు కూతలు చేయకూడదు.
౬ అత్తగారు మామ గారు భర్తతో పుట్టిన వారిని ఎప్పుడు విసుక్కోన రాదు. భర్త వారికి సహాయ సహకారములు చేస్తే మనము అడ్డుగా ఉండకూడదు అందు వల్ల వాళ్ళ శాపానికి గురికాకుండా ఉంటాము.
౭ వివాహానంతరము తన పుట్టింటి స్తితిగతులను అవగాహన చేసుకొని తనకు ఏదైనా కావాలంటే కోరాలి. ఆలా కాకపొతే పుట్టింటి వాళ్ళు అమ్మాయి మనసుపడి అడిగిందని శక్తి మించి అప్పు చేసి మనకు కొనిచ్చి తర్వాత వారు బాధ పడుతుంటే ఏమి చేయలేని అసహాయ స్థితిలో ఉంటాము అందువల్లే అడిగే ముందు ఒకటికి పది సార్లు యోచించి అడగాలి.
౮ ఎదుటి వారి స్థితి గతులను గమనించే పక్వము మంకు వస్తే ఒక కోరిక కోరేముందు బాగుగా యోచనచేసి అడుగగలము.
౯ భర్తపై అలిగో లేక కారణము లేకుండా పుట్టింటికి పోకూడదు తోచి తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళినట్లు. దీనివల్ల మనకు రెండిల్లలోను గౌరవ మర్యాదలు తగ్గిపోతుంది.
౧౦ నేటి స్త్రీకి దేనిని జీర్నించుకొనే శక్తి సామర్త్యములు చాల తక్కువ. ప్రతి చిన్న విషయమునకు బెంబేలు ఎత్తి పోవడము ఒక జాడ్యమై పోయింది. కష్ట నష్టములు మనుషులుకకు కాక వేరెవరికీ రాదు దేనిని ధైర్యముగా ఎదుర్కొని జయించుకొని రావలెను.
౧౧ కుడి చేయి అనామిక అంటే ఉంగరపు వేలి యందు బంగారు ఉంగరమును దరించ వలెను. ఆయుర్వేద శాస్త్రము ఆ వేలి నుండి వెళ్ళే నరము హృదయమునకు చేరుతుంది కాబట్టి బంగారు లోహమునకు హృదయ సంబంద రోగములను నిరోధించే గుణము ఉంది కాబట్టి అలా దరించ వలెను అని చెప్పింది
౧౨ గుమ్మడి కాయ ముక్కలు మార్కెట్టు నుంచి కొనుక్కుని వచ్చిన నాడు వండేయ వలెను లేకుంటే అది మనకు ఆరోగ్యానికి చెడుపు చేస్తుంది
౧౩ ఎవరికైన అప్పు ఇవ్వవలనన్న సాయంకాలము దీపము పెట్టిన తర్వాత మరియు మంగళ శుక్ర వారములలో ఇవ్వరాదు
౧౪ పండ్లు తోమేటప్పుడు ఒకే స్తలమందు ఉండి తోమవలెను ఊరంతా తిరుగ రాదు ఇప్పుడు ఇది ఒక జాడ్యముగా తయారైనది
౧౫ గోళ్ళు ఎప్పుడు కొఱక రాదు.
౧౬ ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడకు వెళతారు అని అడగటమో లేక వెనకకు పిలవదమో లేక తుమ్మడమో లాంటివి చేయకూడదు
౧౭ డబ్బు బంగారు నగలను యెంత కోప ద్వేషములు ఉన్న విసర కూడదు దానిని అలక్ష్యము చేస్తే అది మనలను విడిచి వెళ్లి పోను
౧౮ దీపము పెట్టిన తర్వాత పెను చూడడము, గుడ్డలు కుట్టడం, తలకు నునే రాచు కోవడం చేయ కూడదు ఇది దరిద్రాన్ని ఆహ్వానిన్చేదే
౧౯ భర్త మగ పిల్లలు తులసి అధికము తినకుండా చుసుకోవలెను తులసి క్రిమి సంహారిణి మట్టుకే కాదు వీర్య నిర్జీవము కూడా చేస్తుంది తర్వాత కాలంలో పిల్లలు కలుగలేదని బాధపడడం గుళ్ళు గోపురాలకు తిరగడం చేయక్కరలేదు
౨౦ చవితి చంద్రుని చూడకూడదు కట్టుకునే గుడ్డలకు నిప్పు తగిలి కాలితే ఆ అవస్త్రములను త్యజించేయవలెను ఇంటిలో ఉంచుకోకూడదు
౨౧ ఎడమ చేతితో పిల్లలను తోయడం తలలో కొట్టడం లాంటివి చేయకూడదు ఇంటి ఎదురుగా కుప్పను కుమ్మరించడం దానికి నిప్పు పెట్టడం లాంటివి చేయకూడదు
౨౨ పొద్దున్న లేవగానే ఇంటిలోని వెనుక ద్వారమునే తెరవవలెను అయ్యా మేము ఫ్లాట్లో ఉన్నాము వెనుక ద్వారం లేదు అంటే వెనుక ఉండే కిటికీ తెరిచి కొంతసేపటికి సింహ ద్వారమును తెరువవలెను
౨౩ చేతి నిండుగా ఎన్ని బంగారు గాజులు పెట్టుకొన్నాను ఆకు పచ్చ రంగు అద్దము గాజులను కూడా దరించ వలెను
౨౪ తిన్న తట్ట ఆకో ఎండ నివ్వ రాదు తినగానే ఎత్తేయ వలెను తిన్న తట్టను లేక ఆకును దాట రాదు వారు వారు తిన్న తట్టలను ఎత్తి కడగడం కుటుంబములో చేయించ వలెను
౨౫ పండుకున్న వాళ్ళను దాటి పోకూడదు. వచ్చి కూర్చున్న తర్వాతే వడ్డించ వలెను
౨౬ భూమిపై రాస్తూ నడవటం భూమి అదిరేటట్టు నడవటం ఎన్నడు చేయకూడదు స్నానంతరం తుడుచుకున్న తువ్వాలును తలుపుపైన వెయ కూడదు ఇది దరిద్ర హేతువు అయితే మనవాళ్ళు దీనిని అలవాటుగా చేస్తున్నారు
౨౭ స్నానము చేసేటప్పుడు పాడటము మాటలాడడం నవ్వటం లాంటివి చేయకూడదు భగవన్నామము మనసులోనే జపిస్తూ స్నానము చేయవలెను నీటిలో నీడను చూడ రాదు
౨౮ ఉత్తరం లేక కాంక్రీట్ బీం కింద పండుకోనడమే సదవటం చేయకూడదు
౨౯ పడకలలో కూచొని తినడం ఒంటి చేత్తో పెట్టుకొని తినడం తిరుగుతూ తినడం ఒక తట్టలో పెట్టు కొని నలుగురు తినడం లాంటివి ఎన్నడు చేయకూడదు ఇది మహా దరిద్రాని సంబవింప చేయును అయితే ఇప్పుడు ప్రజానీకం దీనిని ఒక గొప్పగా చేస్తున్నారు పిదప కాలంలో అవస్త పడేటప్పుడు మనము చూడలేము కదా?
౩౦ అన్నము ఉప్పు నెయ్యి చేతితో వడ్డించ కూడదు గరిట తోనే వడ్డించాలి వద్దిన్చేతప్ప్పుడు చేతిలో గాజులు లేకుండా వడ్డించ కూడదు తినేటప్పుడు మధ్యలో లేవకూడదు
౩౧ స్త్రీలు ఏళ్ళ వేళల మాంగల్య శ్లోకమును పటిస్తున్డాలి. ఇది సావిత్రికి అనసూయ ఉపదేశించిన శ్లోకము దీని ప్రభావము వలెనే సావిత్రి యముడినే మెప్పించి తన భర్త ప్రాణములను మరల పొందింది మీకు కూడా ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ మీరు కూడా ప్రార్తిసుంటే మీకు కూడా దీర్ఘ సౌమంగల్యము ఉంటుంది
MANGALE MANGALAADHARE MAANGALYA MANGALAPRADE MANGALAARTHAM MANGALESI MAANGALYAM DEHIME SAADAA
పై శ్లోకమును తెలుగులో అనువరించుటకు కుదర లేదు మంగలి అనే వస్తుంది అందువల్ల ఆంగ్లములో ఇచ్చాను. అర్థము చేసుకుంటారు అని అను కుంటాను
మరి కొన్ని రేపు చూస్తామ మరి ........
No comments:
Post a Comment