మీరు గమనించ వలసినది
౧ పుట్టినరోజు వివాహమైన రోజు మొదలగు విశేష దినములందు ఇంటిలోని పెద్ద వారందరికీ నమస్కరించి ఆశిస్సులు పొందడం మనము అనుసరించి పిల్లలందరినీ అనుసరింప చేయవలెను
౨ అందరు తల దువ్వుకోనేటప్పుడు పాపిట తీసి దువ్వుకొన వలెను. పాపిట లేకుండా దువ్వుకోనుట దరిద్రాని సంభవింప చేస్తుంది. పాపిట తీయడంలో ఆరోగ్య విషయము ఏమిటంటే తలలో నీరు చేరకుండా ఉండడానికి సహకరిస్తుంది తలలో నీరు చేరుకొంటే అనేక రోగములకు దారి తీస్తుంది కదా.
౩ మెంతులు ఆహారములో ఉపయోగించడం వలన బుద్ధి కుశలత పెరుగుతుంది
౪ ప్రతిరోజూ రెండు అరటి పండ్లను తీసుకొంటే రక్త పోటు తగ్గుతుంది. కార్రోట్ వండేటప్పుడు ఇంకొక కూరను చేర్చకుండా వండవలెను లేకపోతె కార్రోట్ పోషక విలువలు దొరకవు.
౫ పితృ దినములను భిక్షము ఇంటిలో వేయకూడదు. రోలు రోకలి సంనిగిల్లు చాట ఇంటి కడప పైన కుర్చొన కూడదు అందువల్ల దరిద్రము సంభవించును. కూర్చొనే బల్లను కాలితో తన్న కూడదు. పండుకొని నీరు త్రాగరాదు.
౬ రెండు చేతులతో తలను గీరుకోరాదు. తల విరవ పోసుకొని గడప దాటి పోరాడు.
౭ ఇతరులపై కోపగించుకోని చాడీలు చెప్పరాదు.తన గురించి తన కుటుంబం గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు ఎదుటి వారి మనస్సు నొచ్చు కోనేలాగున మాటలాడ కూడదు.
౮ సదా నామ స్మరణ చేయండి వంట వండేటప్పుడు ఇంటిలో మిగత పనులు చేసుకునేటప్పుడు నామ స్మరణ చేస్తూ ఉంటె మనకు అవసాన కాలంలోకూడా మన మనస్సు దానినే స్మరిస్తూ మనకు పై జన్మ ఉత్తమమైనదిగా దొరుకును
౯ కాలము వస్తువు యొక్క విలువ తెలుసుకొని దానిని ఉపయోగించుకోన వలెను.
౧౦ కుటుంబములోని కలతలను బంధువుల వైషమ్యములను స్త్రీ అవలీలగా సరిచేయ గలదు. బుద్ధి కుశలత ఇచ్చి పుచ్చుకొనే మనస్తత్వము ఉండవలెను.
౧౧ ఇంటిలోపల వెంకటేశ్వర స్వామి అమ్మవారితో కూడా స్వర్ణ అలంకారములతో ఉండే పటము వుంచుకొని పుజిస్తుంటే వాస్తు దోషములన్నియో పరిహారము అగును. .
౧౨ మురికి చేరుకొన్న పళ్ళు, మురికి గుడ్డలు ధరించడం, చిరిగినా దుస్తులు ధరించడం, అధికమైన తిండి, ఎల్లప్పుడు నిష్టుర భాషణం, సంధ్యా కాలాలలో నిద్రించడం చేయకుదనివి ఇది దరిద్రానికి దారి కల్పిస్తుంది.
౧౩ అజీర్ణమునకు జీలకర సొంటి జాజికాయ పొడి సమముగా ఒక స్పూన్ తీసుకొని వెచ్చటి నీతితో తాగితే సరిపోతుంది. మలబద్దకం ఉంటె రాత్రి పడుకొనే ముందు ఒక స్పూన్ కరక్కాయ పొడి వెచ్చటి నీతితో తాగి పడుకోండి పొద్దున్న సులబమైన విరేచనము కలుగును. దగ్గు అధికముగా వుంటే కొద్దిగా మిరియాలు తాటి కలకండ కలిపి బుగ్గలో పెట్టుకొని ఆ నీటిని మింగుతూ వుంటే చాలు.
౧౪ సుఖమైన దుఖమైన దానిని అనుభవించ వలసిందే ఇది రెండు బండి చక్రముల వలె మానవ జీవితంలో వచ్చేవే ఏది శాశ్వతముగా ఉండదు.
౧౫ సంపాదనకు తగ్గట్టుగా సెలవు చేస్తూ ఎంతో కొంత పొడుపు చేస్తున్దవలెను. పిల్లల వివాహమునకు చేర్చునది ఉద్యోగ విశ్రాంతి కాలమందు వచ్చిన ధనము తప్పకుండ గవర్నమెంట్ బ్యాంకు యందు మట్టుకే పెట్టుకోండి అధికమైన వడ్డీ ఇస్తారని వ్యాపారుల మాయ మాటలకు మోసపోయి మొదటికే నష్టము తెచ్చుకోకండి ఎదుటి వారి మాయ మాటలకు లోన్గితే కుటుంబము గతి అధోగతి అయిపోను.
౧౬ ఎట్టి పరిస్తితి లోను నగలు అరువు తీసుకోకండి మీరు అరువు ఇవ్వకండి
౧౭ కుటుంబములో ఒకరికొకరు అనుసరణతో నడచుకో వలెను. తన మాటే నెగ్గాలని ప్రవర్తించ కూడదు. సత్ప్రవర్తన లేని భర్తను, ముక్కోపిని దుర్భాషలాడు భర్తను భార్య మంచి మార్గమునకు తన ప్రవర్తనతో తీసుకు రాగలదు.
౧౮ ఇంటి ముందరి హాలులోనే మంచి నీటి వసతి కల్పించుకోవడం చాల అవస్యము. నేటి కాలంలో మంచినీరు అడిగి తెచ్చేలోపు ఎన్నో ఘాతుకములు జరిగిపోతున్నది. స్త్రీలు వృద్దులు ఒక్కరే ఇంటిలో ఉండేటప్పుడు తెలిసినవారని పోరుగువారని లోనికి వదలకూడదు.
౧౯ పొరుగువారి ఎదుట మన ఇంటి వ్యవహారములను చర్చించ కూడదు. మన ఇంటి లోటు పాతులను యెంత సన్నిహితులైనను చర్చిన కూడదు. తన భర్త గురించో అత్తా మామల గురించో కోడలి గురించో ఇరుగు పొరుగు వారితో చర్చించ రాదు దీని వల్ల మనకు ఒరిగేది ఏమి లేదు కాక పొతే వారి వద్ద మనము చులకనై పోతాము.
౨౦ దూర దర్శని సీరియల్స్ చూడకండి అవి మీ బుర్రలను నాశనము చేయును. మీ పిల్లల అభ్యుదయమే మీకు మొదటి కర్తవ్యము
No comments:
Post a Comment