music

mp3 format files

Monday, June 18, 2012

stree naadu needu

మనము లౌకికమైన సామెత "ఇంటిని  చూసి ఇల్లాలిని చూడు" "గ్రుహాన్తే గృహ కల్లోలం గ్రామాన్తే శునక రోదనం "  విని వుంటారు. దీనికి అర్థము ఏమంటే మన సనాతన ధర్మములో స్త్రీకి చాల ఉత్కృష్టమైన గొప్ప స్థానము ఉంది.  పరమేశ్వరునికి అనంతరం ఒక స్త్రీకే ఆలనా పాలన పోషణ శక్తులు ఆ దేవుడు ఇచ్చాడు. అందువల్లే సనాతన ధర్మములు స్త్రీని అన్నివిధముల గౌరవిమ్పవలేనని నొక్కి చెప్పుచున్నది. స్త్రీలకూ సహజముగా యెంత సౌకుమారత్వము ఉంటుందో అంత కార్య దీక్ష కఠిన నిర్ణయా చరణ గలదు.  ఒక స్త్రీ మట్టుకే భర్తతోకుడా సజీవాముగా మనస్పూర్తిగా దహనము కాగల ధైర్య స్తైర్యములు గల్గిన వ్యక్తీ. అంటే ఒక స్త్రీ జాతి మట్టుకే సహగమనము అంటే సహ గమనము చేయగలిగిన వ్యక్తి.
సనాతన ధర్మములో మరియు ఆదియైన ఋగ్వేదములో స్త్రీ  భర్తకు సవ్యభాగాములో అంటే కుడిప్రక్క ఎల్లప్పుడు వుండి అతనిని ధర్మమూ అనుసరింప చేయుటకు కార్యోన్ముఖుని చేస్తుంటుంది. ఆశ్రమములలోకేల్ల గృహస్తాశ్రమమే గొప్పది. అందు స్త్రీ సహాయముతో మిగతా ఆశ్రమములను పోషించుటకు అవకాశము కల్పించ బడినది.  స్త్రీ వినా పురుషుడు యే కార్యము చేయుటకు అర్హుడు కాదు. 
శక్తిహీనో శివ శవః అని మనము వినే వున్నాము కదా  అంటే మయా స్వరూపమైన శక్తి కలవకపోతే పరమేశ్వరుడు కుడా అంతర్ముఖుడుగానే ఉంటూ చైతన్యములేకుండా ఉంటాడు. దేవునికైనా మనిషికైనా చైతన్యము ఇచ్చేది ఒక స్త్రీ ముర్తియే.  ఆ స్త్రీ మన జీవితములో చెల్లిగా తల్లిగా భార్యగా ఉంటూ మనలను ముందుకు నడిపిస్తుంటుంది.  వేమన పద్యము మీకు గుర్తు వుంటుంది అనుకుంటా  అదే కంటిలోని నలుసు, కాలిలోని ముళ్ళు, చేవులోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇంత గొప్ప లక్షణములు గల స్త్రీ మూర్తి ఎలా  వుండాలి అని మన సనాతన దారము చాల చాక్కగా చెప్పింది.  దానిని మీతో పంచుకుందామని యే    మన   ప్రయత్నము.   యత్ర  నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని స్మ్రుతి వచనం.
కాని ప్రస్తుత కాలంలో స్త్రీ పరిస్తితి చాల విషమముగా పరిణమించి ఉంది.  నేటి స్త్రీ మూర్తి విదేశ హావ భావములకు అనుకరణకు పోతూ చాల మార్పులు పొంది స్వమత ఆచరణము వదిలి వేసిన కారణముగా చాల క్లిష్ట పరిస్తుతులు ఎదుర్కొనవలసి వస్తున్నది.
మన దేశములో భిక్షాటనకు వచ్చిన వ్యక్తికూడా ఏడు వత్సరముల బాలికను అమ్మ భిక్ష వేయి తల్లి అని అంటాడే కాని బాలిక భిక్షము వేయమని అడగడు కదా?  పాశ్చాత్య దెస సాంప్రదాయములలో స్త్రీ ఒక భోగ వస్తువే కాని ఎన్నటికి గౌరవము లేదు.  ఇది నేను చెప్పేది కాదు స్వామీ వివేకానందుడు చికాగో సభలో చెప్పిన వాక్యము  స్త్రీ మూర్తి వల్లే మనకు జన్మ లభ్యమవడము ఆ స్త్రీ మూర్తి వెళ్ళిపోతే మల్ల మరిఒక తల్లి లభ్యము కాదు .
స్త్రీ మూర్తి మట్టుకే ఆచార వ్యవహారములను తెలుసుకొని తానూ ఆచరిస్తూ తన కుటుంబమును ఆచరింప చేస్తుంది.
స్త్రీ తన దేహ మనో దైర్యములను పెంచుకొని జీవించ వలెను.  చెప్పుడు మాటలు వినకుండా స్వనిర్ణయములు అలోచించి తీసుకోవలెను.
స్త్రీలు పురుషులతో సమానముగా విద్య ఉద్యోగములు సంపాదించుకొన వచ్చును అయితే నియమములేని స్వాతంత్రము కూడదు అది వారికి మంచికంటే హానియే చాల చేసుసు.
మన పూర్వకాలములో విద్యా బుద్దులు మెండుగా గల స్త్రీ మూర్తులు ఎందరో వున్నారు అయితే వాళ్ళు ఎన్నడు స్వధర్మాచరణ  వదల లేదు.విద్య వివేకమును విచక్షణను ఇవ్వవలనే కాని గర్వమును ఇవ్వకూడదు.ప్రస్తుత కాల పరిస్తుతులకు అనుగుణమైన విద్య స్త్రీకి అవసరమే అయితే మన సాంప్రదాయ సనాతన ధర్మ మార్గావలంబన వదల కూడదు అది వదిలిన నాడు మన సమాజమే క్షీణించి పోతుంది. అందువల్ల స్త్రీలు అప్రమత్తులుగా ఉండవలెను.రేపటి తరములు స్తీ పైన మట్టుకే ఆధార పడివుంటారు.
మిగతా వివరములు రేపు చేద్దామ మరి ......

No comments:

Post a Comment