స్త్రీల మానసిక స్థితి
కొంత కాలము క్రితము వరకు స్త్రీలకూ వారి శక్తి యుక్తులు తెలియకుండానే ఉండిపోయింది. వాళ్ళకు వల్లే బలహీనులు అని వాపోవుచున్దిరి. ప్రమంచము తెలియదు అని ఇంటిలోపే వంటింట్లో కుందేలు లా కాలము వెళ్ళ పెట్టుతున్దిరి. నేటి పరిస్థితి వేరు స్త్రీకి తన శక్తి సామర్త్యములు తెలియ వచ్చినది. అయిన ఇంకను బలహీనత పోలేదు. తానూ చేసేది సరి తప్పు అని యోచన చేయుటకు వారి మనస్సు అంగీకరిచడం లేదు. తన నిర్ణయమే సరి అని తలంప చేయిన్చుచున్నది. ఈ స్థితి చాలా అక్రుత్యములు చేయించు చున్నది. ఉదాహరణకు అత్తగారు, కోడలు, వదిన, ఆడబిడ్డ.
అత్తగారు కోడలిని, ఆడబిడ్డ వదినగారిని వేదించడం తగ్గ లేదు. స్త్రీయే స్త్రీకి శత్రువుగా వుంది. దీనివల్ల, తన సమయము వరకు వేచి యుండి తానూ వేదిమ్పబడినది కావున తన వంతుకు అత్తగారి కడపటి కాలంలో ప్రత్యక్ష నరకము చూపించడానికి హేతువు అవుతుంది. ఒకటి ఇరువురు మరచి పోతారు అదియే పాపము మూట కట్టుకోవడం. దీని పరిణామం వేరొక జన్మలో దీన పరిస్థితిలో వుండు కుటుంబములో జన్మ ఎత్తి మరల అవస్స్తలకు గురి కావడం. ఈ స్త్తితి మరచి పోయి తప్పులు చేస్తూ వుంటారు.
కొంత కాలానికి మనకు మట్టుకు ఎందుకు ఈ దీనస్థితి ఇంత కష్టాలు భగవంతుడు ఇచ్చాడు అని వాపోతారు. కారణము లేక కార్యము వుండదు అనే విషయము మర్చి పోతాము. మనము పొరుగు వాళ్ళను అవస్తకు గురి చేస్తే నేడు మనము అవాస్తాలకు గురి అవుతామని యోచిన్చరు. దేవుడు ఎవరికి కష్టములు ఇస్తాడు ఇంకొకరి కష్టములు ఇచ్చిన వారికే తప్ప.
మనమే కాష్టములను కొని తెచ్చుకొంటాము. దీన పరిస్థితి ఎదుటివారి వల్ల రాదు. దీనికి మార్గమేమి.
అత్తగారో కొడలో ఆడబిద్దో వదినగారో అందరు స్త్రీలే అనే గౌరవించే మనస్సు రావాలి. ప్రతి ఒక్కరు మాటలు చేష్టలతో వ్యన్గ్యముగా బాధించ కూడదు. ధన దాన్యములతో సిరి సంపదలతో జీవితమూ గడపాలంటే ఎదుటి వారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ మనము గోవరవిమ్పబడుతూ జీవితమూ గడపాలి.
చెప్ప వలసినది చెప్పియే తీరవలెను. మరి సాత్వీకముగా వుంటే మన పరస్థితి మారిపోతుంది. దేవుడు గుళ్ళకు వెల్లడము, వ్రతాలు పూజలు చేయడం వల్లనే మనలను కరుణించ లేరు ప్రేమ సాత్వీక జీవితముతో సాగిస్తేనే తన కృప దొరుకుతుంది
ప్రతి స్త్రీ దీనిని బాగుగా మనస్సుకు అర్థము చేసుకొని ఎదుటి వారికి గౌరవ మర్యాదలు పంచుతూ తానూ పొందుతూ అత్యవసరమైతే తగినంత మాత్రము చురకలు అందిస్తూ బతకాలని అప్పుడే మీ జేవితము మూడు పూలు ఆరు కాయలుగా సాగగలదని నా అభిప్రాయము
ప్రతి రోజు స్త్రీ దేవుని ముంది స్నానము అనంతరం ఈ కింది శ్లోకము చెప్పి నమస్కరిస్తుంటే అవైధవ్యము రానే రాదు
ఓంకార పుర్వికే దేవి వీణా పుస్తక ధారిణి, వేద మాతా నమస్తుబ్యం అవైధవ్యంచ ప్రయచ్చమే
పతివ్రతే మహాభాగే భర్తుస్చ ప్రియవాదిని అవైధవ్యంచ సౌభాగ్యం దేహిత్వం మమ సువ్రుతే
పుత్రాన్ పౌత్రాంచ సౌఖ్యంచ సౌమాన్గాల్యంచ దేహిమే
No comments:
Post a Comment